పాములపాడు మండలం జుటూరులో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. నేర చరిత్ర ఉన్నవారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 31 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని పిక్కి ఈశ్వరయ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.