డోన్ ఉప ఖజానా కార్యాలయాన్ని గురువారం జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, ట్రెజరీ బిల్లుల రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. కార్యాలయం చుట్టుపక్కల స్వచ్ఛత పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ఖజానా అధికారి పలనాటి సునీల్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.