డోన్ పట్టణంలోని రోకలిబండసత్రం, పాతపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుధ్యం, సిబ్బంది పనితీరును పరిశీలించి, రోగులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండొద్దని, అవసరమైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.