కర్నూలు జిల్లాలో 20 లక్షలు దాటిన జనగణన నమోదు

కర్నూలు జిల్లాలో జనగణన నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం జిల్లా అధికారుల సమాచారం మేరకు, 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 17,78,415 కాగా, తాజా నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 20,15,423 మంది వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా అంచనా జనాభా 21,67,518గా ఉందని, కౌతాళం మండలంలో అత్యధికంగా 91,468 మంది వివరాలు నమోదు అయ్యాయని, కోసిగి, మంత్రాలయం, నందవరం, సీ. బెళగల్ మండలాల్లో కూడా నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్