స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్‌తో కలిసి పనులను పరిశీలించిన ఆయన, ఏప్రిల్‌లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంఆర్ఎఫ్ పనులు వేగవంతం చేసి, చెత్తను శాస్త్రీయంగా వినియోగించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.