సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తా గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పేర్కొన్నారు. ఈ చట్టం పారదర్శకత, జవాబుదారితనం పెంచి, అవినీతి రహిత పాలనకు దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకుని, ఇతరులకు చైతన్యం కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్. వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.