గూడూరు: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

గూడూరు సబ్ డివిజన్ పరిధిలో సాధారణ నిర్వహణ పనుల కారణంగా జూన్ 13 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డిప్యూటీ ఈఈ జేసన్ తెలిపారు. 33 కేవీ లద్దగిరి, సి. బెళగల్ విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గూడూరు, కోడుమూరు, సి. బెళగల్ మండలాల్లోని అన్ని 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే వ్యవసాయ ఫీడర్లకు ఉదయం 5 గంటల నుంచి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందజేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్