కోడుమూరు: 'పీ4 విధానంపై అవగాహన సమావేశం'

కోడుమూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పీ4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్) విధానంపై అవగాహన సమావేశం జరిగింది. ఎంపీడీవో రాముడు, ఏవో రవిప్రకాష్, ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, రేషన్ డీలర్లు, ఫర్టిలైజర్ షాప్స్ నిర్వహించే వారు పాల్గొన్నారు. అతి పేదరికంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి వారందరూ స్వచ్ఛందంగా పీ4 విధానంలో రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్