కోడుమూరు: పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే పరిష్కరించాలి

కోడుమూరు మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సోమవారం సీఐటీయూ అధ్యక్షుడు గఫూర్ మియా, కార్యదర్శి జి. పి. వీరన్న మాట్లాడుతూ, మండలంలో ఐదు పెట్రోల్ బంకులు ఉన్నా సరఫరా లేదని, కొందరు యజమానులు ముందస్తు చెల్లింపులు చేసినా డీజిల్, పెట్రోల్ అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్