కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (ఎన్‌కోర్డ్) సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల పరిసరాల్లో నిఘా పెంచాలని, ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణాను అడ్డుకోవాలని, డ్రగ్ స్క్రీనింగ్ కిట్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. నగరంలోని చీకటి ప్రాంతాల్లో లైటింగ్, సీసీటీవీ కెమెరాలతో భద్రత పెంచాలని తెలిపారు.