కర్నూలు నగరంలోని జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పనుల జాప్యంపై కలెక్టర్ డా. ఏ. సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆమె, రోగులతో మాట్లాడి సేవలపై వివరాలు తెలుసుకున్నారు. యురాలజీ, న్యూరోసర్జరీ ఓటీ పనుల ఆలస్యంపై ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను మందలించారు. బూత్ బంగ్లా వార్డుల్లో తలుపులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రంలోపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.