కర్నూలు జిల్లాలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పదోన్నతికి జరుగుతున్న ఎంపిక పరీక్షలను అనంతపురం రేంజ్ ఇంచార్జి డీఐజీ డాక్టర్ షెముషి ఐపీఎస్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. కర్నూలు మండలం దిన్నదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో రాయలసీమ జోన్ పరిధిలోని 72 మంది ఎస్సైలు పాల్గొన్నారు. ఔట్‌డోర్, ఇండోర్ పరీక్షలు నిర్వహించారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేర స్థల పరిశీలన, మౌఖిక పరీక్ష వంటి అంశాలపై అభ్యర్థులను పరీక్షించారు.