రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో డీఆర్సీ (జిల్లా సమీక్షా కమిటీ) సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జిల్లాస్థాయి బడ్జెట్ అమలు కార్యక్రమంపై అధికారులతో చర్చించనున్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు సమగ్ర నివేదికలు సమర్పించనున్నారు.