కోడుమూరు మండలంలోని ఆమడగుంట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఎంపీడీవో రాముడు సచివాలయం, అంగన్వాడీ సెంటర్, జిల్లా పాఠశాలలు, బీసీ హాస్టల్, కో-లొకేటెడ్ పీహెచ్‌సీలను పర్యవేక్షించారు. ఇంటి వసూళ్లు, అంగన్వాడీ పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం, వైద్య సదుపాయాలను సమగ్రంగా తనిఖీ చేసి, సిబ్బందికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.