కర్నూలు: రహదారి విస్తరణ బాధితులకు పూర్తి న్యాయం: కమిషనర్

కర్నూలు నగరంలో రహదారి విస్తరణలో భూములు, భవనాలు కోల్పోయే బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం కిడ్స్‌ వరల్డ్‌–బుధవారపేట(ఆర్‌టీపీ–2), చెక్‌పోస్టు–ఎస్‌ఎస్‌ గార్డెన్స్‌ మార్గాల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని, బాధితులకు విస్తరణ అవసరాన్ని వివరించి యాజమాన్య పత్రాలు సేకరించాలని ఆదేశించారు. విస్తరణలో ప్రభావితమవుతున్న 82 ఆస్తుల యజమానుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్