కర్నూలు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, ప్రజల సౌకర్యార్థం స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ భవనంలో లక్కీ డ్రా నిర్వహించి, 60 షాపుల ప్రణాళికలో భాగంగా 39 షాపులను కేటాయించారు. నగర అభివృద్ధిలో భాగంగా ప్రజల విహారానికి, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈట్ స్ట్రీట్ కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.