కర్నూలు: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం అసహ్యం: కమిషనర్

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మంగళవారం ఆశోక్ నగర్, పాతబస్తీ, కల్లూరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వహించాలని, చిన్న, మధ్యస్థాయి కాలువల్లో ప్రతి వారం పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న సమయంలో గ్యాంగ్ వర్కర్లతో పూడికతీత పనులు నిర్వహించి, 24 గంటల్లోపు వ్యర్థాలను తొలగించాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్