కర్నూలు: అర్జీలను ‌సత్వరమే పరిష్కారించాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను ‌సత్వరమే పరిష్కారించాలని కర్నూలు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్‌యస్ 22 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్