కర్నూలు: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గురువారం నగరపాలక కార్యాలయంలో ట్రాఫిక్ పోలీస్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం కొత్త బస్‌స్టాప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రవాణా శాఖ సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్