కర్నూలు జిల్లా కోర్టులో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

కర్నూలు జిల్లా న్యాయమూర్తి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో మంగళవారం జిల్లా కోర్టుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఫోక్సో న్యాయమూర్తి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్, పోలీసు అధికారులు కోర్టు ప్రాంగణాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్మనెంట్ సెక్యూరిటీ యూనిట్లు, సెక్యూరిటీ రూమ్స్, గస్తీ విధులు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్