కౌతాళంలోని 1వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కౌతాళం సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు స్వయంగా పరిశీలించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించారు. పరిసరాల పరిశుభ్రత గ్రామ ప్రజలందరి బాధ్యత అని, ప్లాస్టిక్, గాజు సీసాలు, చెత్త వంటి వ్యర్థాలను డ్రైనేజీ కాలువల్లో వేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని డంప్ యార్డులో వేయాలని ఆయన సూచించారు.