కర్నూలు: కుడా చైర్మన్ హెచ్చరిక అనుమతి లేకుండా ఇళ్ళు కట్టకండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనుమతి లేకుండా ఇళ్లు కట్టినవారు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు వెంటనే రుసుములు చెల్లించి కుడా నుండి సరైన అనుమతులు పొందాలని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా నగర అభివృద్ధికి అనుగుణంగా ఆస్తుల చట్టబద్ధత, పౌర సౌకర్యాలు అందించబడతాయని ఆయన తెలిపారు. నాన్ లేఅవుట్ల ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసినవారు, మంత్రాలయం, పాణ్యం, వెల్దుర్తి వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేసినవారు కూడా అనుమతులు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్