మంత్రాలయం: 200 గదుల అభివృద్ధి పనులు పరిశీలించిన స్వామీజీ

మంత్రాలయం పట్టణంలోని శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ, ఇంజినీర్ సురేష్‌తో కలిసి 200 గదుల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, కాంట్రాక్టర్‌కు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా వసతుల విస్తరణ, మెరుగైన సేవల అమలు అవసరమని స్వామీజీ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో మంత్రాలయం మరింత సుందరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్