మంత్రాలయం: అనుమతుల్లేని లాడ్జీలు, హోంస్టేలను కూల్చేస్తాం

మంగళవారం మంత్రాలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అనుమతులు లేకుండా నిర్మించిన లాడ్జీలు, హోంస్టేలను సక్రమం చేసుకునేందుకు నెల గడువున నోటీసులు ఇస్తామని తెలిపారు. యజమానులు స్పందించకపోతే నీరు, విద్యుత్ నిలుపుదల తర్వాత కూల్చివేయనున్నారని హెచ్చరించారు. పార్కింగ్, అగ్నిమాపక ఏర్పాట్లు లేకుండా నిర్వహించిన లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్