కర్నూలు జిల్లా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్-ఇన్‌స్పెక్టర్ మారుతిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కలిసి స్వాగతించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శక, నిష్పక్షపాత పాలన అందిస్తానని మారుతి హామీ ఇచ్చారు. ప్రజలు భయం లేకుండా సంప్రదించాలని, చట్టబద్ధమైన చర్యలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ మండలంలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.