డోన్: డీఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ

డోన్ పట్టణంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో బైకులతో సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, రోడ్లపై ప్రతి ఒక్కరి ప్రాణ సంరక్షణకు హెల్మెట్ ధారణ అత్యవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్