నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, భారత పార్లమెంట్ సభ్యుల బృందంతో కలిసి నార్వే పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించారు. ఈ పర్యటనలో పరిపాలన, ప్రజా విధానం, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై జరిగిన చర్చలు విలువైన అవగాహనను అందించాయని తెలిపారు. పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడానికి ఈ పర్యటన దోహదపడిందని ఆమె పేర్కొన్నారు.