రాష్ట్రవ్యాప్తంగా ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గురువారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో నాలుగు సార్లు అదే గ్రామాన్ని అధికారులు సందర్శించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను దగ్గరగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.