జూపాడు బంగ్లాలో నెలరోజులుగా గ్యాస్ సిలిండర్లు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా సరఫరా లేకపోవడంతో సీపీఐ నాయకుడు రమేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు నేషనల్ హైవేపై శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా, సరఫరా జరగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.