2026లో నంద్యాల అభివృద్ధికి సమిష్టి కృషి: కలెక్టర్

ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు నేరుగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రెవెన్యూ సేవలు సత్వరంగా అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్