సంజామల మండలం నొస్సం గ్రామంలో ఎకరూన్ కంపెనీకి భూమి కేటాయింపు అంశాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని బుధవారం అధికారులను ఆదేశించారు. కంపెనీ ప్రతిపాదనలు, భూమి విస్తీర్ణం, మ్యాపులు పరిశీలించిన జేసీ.. అవసరమైన సూచనలు చేశారు. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.