నంద్యాలలో రసాయన విపత్తులపై మాక్ డ్రిల్

నంద్యాల జిల్లాలో రసాయన విపత్తుల అత్యవసర పరిస్థితులకు సన్నద్ధతను బలోపేతం చేసేందుకు ఈ నెల 30న ఆఫ్‌సైట్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. విపత్తుల సమయంలో సమన్వయం, స్పందన వేగం మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖలు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్