నంద్యాల జిల్లాలో 2.07 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నారు. ఒక్క రైతుకు రూ. 7,000 లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈకేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు.