నంద్యాల జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను మెరుగుపరిచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశించారు. పోలీస్ అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా సమాచారం అందిస్తున్నారు.