జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం, రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా సంబంధిత కార్యాలయాల్లో సమర్పించవచ్చు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం ఉంది.