నంద్యాల: పోలీస్ సంక్షేమ దివస్‌లో సిబ్బంది అర్జీల స్వీకరణ

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ అధ్యక్షతన పోలీస్ సంక్షేమ దివస్ (గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, హోంగార్డుల నుంచి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్