అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు.