కలెక్టర్ రాజకుమారి పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులను సేవలపై ప్రశ్నించిన ఆమె, డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసి వెళ్లడంతో వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.