యువత, విద్యార్థి దశ నుండే జనాభా నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని సెట్కూరు సీఈవో వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం పెద్దపాడు ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ 1989లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గుర్తించిందని, జనాభా, పర్యావరణం, ఆరోగ్యం వంటి అంశాలపై యువత దృష్టి పెడుతారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఈరన్న రావు, శ్యాంబాబు పాల్గొన్నారు.