ఆర్ఆర్ఆర్ పథకంలో భాగంగా నంద్యాల జిల్లాలో రూ. 138 కోట్లతో 91 ఆయకట్టు అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధమైందని గురువారం కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కేంద్రం 60%, రాష్ట్రం 40% వంతుగా ఖర్చు భరిస్తుందని చెప్పారు. రెండో దశలో రూ. 16 కోట్లతో 19 పనులకు ప్రతిపాదనలు రూపొందించామని ఆమె వివరించారు.