బి. తాండ్రపాడు: సంక్రాంతి పండుగకు టికెట్ల ధరలు పెంచితే చర్యలు

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు టికెట్ ధరలను అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. శుక్రవారం బి. తాండ్రపాడు ఉపరవాణా కమిషనర్ ఎస్. శాంత కుమారి మాట్లాడుతూ, బస్సులు అధిక చార్జీలు వసూలు చేయరాదని, రెండవ డ్రైవర్ తప్పనిసరిగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఆర్టీసీ నిర్దేశించిన ధరల కంటే గరిష్ఠంగా 50% మాత్రమే టికెట్లు అమ్మాలని సూచించారు. రవాణాశాఖ, ఆర్టీజీఎస్ ద్వారా ధరలను పర్యవేక్షించనుంది.

సంబంధిత పోస్ట్