కల్లూరు: అనధికార లేఅవుట్ హెచ్చరిక: ఆ ప్లాట్లు కొనొద్దు

కల్లూరు అర్బన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 696 (పి)లో తిరుమల గిరి ఫేస్-6 పేరుతో ఏర్పాటైన లేఅవుట్ అనధికారికమని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లేఅవుట్ ఎల్ఆర్ఎస్-2020 పథకం కింద కూడా దరఖాస్తు చేయలేదని, ఇందులో రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడవని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్