కర్నూలు: జనాభా లెక్కల సేకరణ–2027పై అవగాహన పెంచాలి: సీఎస్

రాష్ట్రంలో 2027లో జరగనున్న జనాభా లెక్కల సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని, ప్రజల అవగాహన కోసం ప్రత్యేక ఐఈసీ మెటీరియల్‌ను సిద్ధం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్