కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో, ప్రమాదాల నివారణకు ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.