కర్నూలు జిల్లాలో నియోజకవర్గాల వారీగా స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీపీ) పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో, 2026-27 నాటికి జీడీపీని గణనీయంగా పెంచేలా వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్ధక, పరిశ్రమల రంగాలపై దృష్టి సారించి, ప్రతి నియోజకవర్గంలో లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.