కల్లూరు-కర్నూలు రిజిస్టర్ కార్యాలయాల్లో యూరినల్స్, వాష్‌రూమ్స్, లిఫ్ట్ వంటి కనీస వసతులు లేవని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. వృద్ధులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వసతులు కల్పించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.