కర్నూలు: అద్దె చెల్లించని మున్సిపల్ షాపులు సీజ్: కమిషనర్

కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన షాపుల అద్దెలు చెల్లించకుండా బకాయిలు పెంచుతున్న దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం కల్లూరు, రైల్వే స్టేషన్, ఎన్ఆర్‌పేట, కొత్తపేట ప్రాంతాల్లోని మున్సిపల్ షాపులను పరిశీలించిన ఆయన, కొంతమంది లీజుదారులు షాపులను ఇతరులకు అద్దెకు ఇచ్చి అధిక మొత్తాలు వసూలు చేస్తూ, కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన అద్దెలను నిర్లక్ష్యం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే షాపులను సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల 10వ తేదీలోపు అద్దెల వసూళ్లు పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్