కర్నూలు: ప్రజా ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలి

కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సి. వెంకట నారాయణమ్మ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి, పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సమయానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్