కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, చేపట్టిన రీ-సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. మంగళవారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ దశ రీ-సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న పనులను పరిశీలించి, పొలం సరిహద్దుల నిర్ధారణ, భూమి రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలని అధికారులకు సూచనలు చేశారు.