కర్నూలు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో, 20 కిలోమీటర్ల పరిధిలో ఎత్తైన భవనాలు, విండ్ మిల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ వంటివి నివారించాలని సూచించారు. రోడ్డు కనెక్టివిటీ, పరిశుభ్రత, పచ్చదనం, పైలెట్ శిక్షణ, ప్రమాద నివారణ ఏర్పాట్లపై పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.